గోపాలపురం నియోజకవర్గంలో బుధవారం వైఎస్
జగన్ పర్యటన సందర్భంగా దేవరపల్లిలో ఓ యువకుడు ఆయనను చూసి ఆనందంతో కేరింతలు కొడుతూ చొక్కా విప్పేశాడు. హెలిపాడ్ నుంచి టొబాకో బోర్డుకు వెళ్లే మార్గమధ్యంలో వాహనంపై నుంచి ఆ యువకుడు తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ సన్నివేశాన్ని చూసిన వైఎస్
జగన్ నవ్వుతూ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సంఘటనను అక్కడున్న పార్టీ శ్రేణులు, యువత ఉత్సాహంగా తిలకించారు.