సకాలంలో స్పందించిన ఎమ్మెల్యే మద్దిపాటి

7చూసినవారు
సకాలంలో స్పందించిన ఎమ్మెల్యే మద్దిపాటి
నల్లజర్ల మండలం పుల్లలపాడుకు చెందిన కొండబత్తుల ఫణికుమార్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ అత్యవసర వైద్యం అవసరమైన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తక్షణమే స్పందించారు. కేవలం ఐదు గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రూ. 2 లక్షల 50 వేల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందించారు. అత్యవసర వైద్య సమయంలో ఆర్థిక సాయం అందడంతో బాధిత కుటుంబానికి ఊరట లభించింది.

సంబంధిత పోస్ట్