రెండు రోజులుగా వీధి దీపాలు లేక వాహనదారుల ఇక్కట్లు

1349చూసినవారు
దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో జాతీయ రహదారి నుంచి కృష్ణంపాలెం సర్వీస్ రోడ్డుకు వెళ్లే ఫ్లైఓవర్ సమీపంలో గత రెండు రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు వెలుతురు లేకపోవడంతో ప్రమాదాల ముప్పు పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్లైఓవర్ మలుపు ప్రాంతంలో చీకటి నెలకొనడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్