కృష్ణయ్యగూడెంలో వివాహిత బలవన్మరణం

550చూసినవారు
కృష్ణయ్యగూడెంలో వివాహిత బలవన్మరణం
నల్లజర్ల మండలం కృష్ణయ్యగూడెంలో మంగళవారం వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసే రాజు, అతని భార్య జొన్నకూటి నాగదుర్గ (23) వారు ఉండే ఇల్లు విషయంలో గొడవపడేవారు. ఈ క్రమంలో రాజు పని నిమిత్తం బయటకు వెళ్లేక నాగదుర్గ ఇంటిలో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్