దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను జాతీయ ఉపాధి హామీ పనులను రాజమండ్రి పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు ముళ్ళపూడి దొర చౌదరి గురువారం ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి పని దినాలు 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారని, లబ్ధిదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పనులలో అవకతవకలను నివారించడానికి కఠినమైన చట్టాలు రూపొందించినట్లు ఆయన తెలిపారు.