ప్లాస్టిక్ చెత్త నివారణకు పాఠశాల వినూత్న కార్యక్రమం

1599చూసినవారు
ప్లాస్టిక్ చెత్త నివారణకు పాఠశాల వినూత్న కార్యక్రమం
దేవరపల్లి మండలం దుద్దుకూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్లాస్టిక్ చెత్త నివారణకు పాఠశాల యాజమాన్యం వినూత్న కార్యక్రమం చేపట్టింది. మంగళవారం ఉదయం విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాఠశాల ఆవరణతో పాటు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్దేశించిన డస్ట్ బిన్ లలో వేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి స్వచ్ఛమైన వాతావరణ పరిరక్షణకు కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులు పి. వీర్రాజు సూచించారు.

సంబంధిత పోస్ట్