తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురం మండలంలోని రామన్నపాలెంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల బుధవారం గ్రామం జలమయమైంది. పంట కాలువలు పొంగి, వర్షపు నీరు ఎస్సీ కాలనీలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికురాలు తామరపల్లి వెంకటలక్ష్మి ఇంట్లోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. అధికారులు వెంటనే స్పందించి, మోటార్ల సాయంతో నిల్వ ఉన్న నీటిని తొలగించి, తమకు తగిన రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.