దేవరపల్లి మండలం గౌరీపట్నం వద్ద రాజమహేంద్రవరం–ఏలూరు జాతీయ రహదారిపై బుధవారం భారీ వర్షపు నీరు నిలిచిపోయింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో రహదారి చెరువును తలపిస్తోంది. నిత్యం వందలాది వాహనాలు, ముఖ్యంగా టిప్పర్ లారీలు తిరిగే ఈ ప్రాంతంలో గుంతలు నీటిలో కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటిని తొలగించి, గుంతలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.