గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. శుక్రవారం నల్లజర్లలో రూ. 25 లక్షల వ్యయంతో నిర్మించిన సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. గతంలో వరదల సమయంలో పాత భవనంలో విద్యార్థులు పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, కూటమి ప్రభుత్వం ఆధునిక వంటశాల, మరుగుదొడ్లతో కూడిన భవనాన్ని నిర్మించిందని తెలిపారు.