గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శనివారం సాయంత్రం వైసీపీ నేతలను రాక్షస జాతికి చెందిన వారిగా అభివర్ణించారు. సమాజంలో అలాంటి వారికి స్థానం లేదని ఆయన పేర్కొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన ఆయన, వెంటనే అంబటి రాంబాబు సీఎంకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా వారిలో మార్పు రాలేదని ఎమ్మెల్యే విమర్శించారు.