వైఎస్ఆర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ సమావేశం: స్థానిక ఎన్నికలకు సన్నద్ధం

71చూసినవారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ సమావేశం: స్థానిక ఎన్నికలకు సన్నద్ధం
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ సమావేశం జరిగింది. గ్రామ అధ్యక్షులు పాపోలు వెంకటకృష్ణారావు (రెడ్డి బాబు) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, రాబోయే స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాజీ హోం మినిస్టర్, గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జ్ తానేటి వనితకు కార్యకర్తలు తోడుగా ఉండాలని వెంకటకృష్ణారావు కోరారు. ఈ కార్యక్రమంలో దుద్దుకూరు సోషల్ మీడియా అధ్యక్షులు పెనుమాక వెంకటేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్