తిరుమల లడ్డులో కొవ్వు కలపడం హిందూ ధర్మ ద్రోహం: బీజేపీ నాయకులు

136చూసినవారు
తిరుమల లడ్డులో కొవ్వు కలపడం హిందూ ధర్మ ద్రోహం: బీజేపీ నాయకులు
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని, ఇది సనాతన హిందూ ధర్మంపై జరిగిన ద్రోహం అని కిర్లంపూడి బీజేపీ నాయకులు కాళింగి కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు. ఈ మహా పాపానికి ఒడిగట్టిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టకూడదని ఆయన అన్నారు. ఆలయాల పవిత్రతను కాపాడేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని, భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారికి శిక్ష తప్పదని, ధర్మాన్ని కాపాడుకోవడంలో తాము ఎప్పుడూ ముందుంటామని ఆయన తెలిపారు. ఈ సంఘటన జగ్గంపేట/కిర్లంపూడి ప్రాంతంలో చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్