జగ్గంపేట మండలం జె. కొత్తూరు శివారులో రహస్యంగా పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులపై పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 6,100 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రఘునాథరావు నేతృత్వంలోని సిబ్బంది ఈ దాడులు నిర్వహించారు. మండలంలో కోడిపందాలు, పేకాట లేదా ఇతర జూదాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే తెలియజేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు.