కాకినాడలో ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో అభివృద్ధి పనులు, నిరుద్యోగ సమస్యల పరిష్కారం, కూటమి పార్టీల మధ్య సమన్వయంపై చర్చించారు. జిల్లాకు భారీ పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వారు అభినందించారు.