జగ్గంపేటలో అకాడమిక్ అడిట్ లో డిగ్రీ కళాశాలకు ‘ఏ’ గ్రేడ్

560చూసినవారు
జగ్గంపేటలో అకాడమిక్ అడిట్ లో డిగ్రీ కళాశాలకు ‘ఏ’ గ్రేడ్
జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అకడమిక్ ఆడిట్లో 'ఏ' గ్రేడ్ సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ డా. డి. చెన్నారావు పర్యవేక్షణలో అకడమిక్ అడ్వైజర్లు డా. జి. పి. చక్రవర్తి, డా. వి. నారాయణ రావు కళాశాలలోని అన్ని విభాగాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యా ప్రమాణాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ వారు ఈ గ్రేడ్ ను ఖరారు చేశారు.

ట్యాగ్స్ :