జగ్గంపేట మండల శివారులో ఆదివారం పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై టి. రఘునాథరావు ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో వీరు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ. 6,150 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, రేపు కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.