జగ్గంపేటలో భారీగా గంజాయి పట్టివేత

1003చూసినవారు
జగ్గంపేటలో భారీగా గంజాయి పట్టివేత
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు జగ్గంపేట పోలీసులు జే. కొత్తూరు గ్రామంలో భారీ గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా నుంచి శ్రీ సత్యసాయి జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న 162.075 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి గంజాయి, గూడ్స్ ఆటో, నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం విలువ సుమారు రూ. 82.48 లక్షలుగా అంచనా వేయబడింది. జగ్గంపేట పీఎస్‌లో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్