రాష్ట్రంలో గ్రామ సర్పంచుల పదవీకాలం ముగియడంతో, జగ్గంపేట మండలం, జె.కొత్తూరు గ్రామ సర్పంచ్ నకిరెడ్డి నాగేశ్వరరావు పదవీ విరమణ సందర్భంగా బుధవారం పంచాయతీ కార్యాలయంలో సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీఈసీ నెంబర్ జ్యోతుల చంటిబాబు, సర్పంచ్ నకిరెడ్డి నాగేశ్వరరావుతో పాటు పాలకవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి, జె.కొత్తూరు గ్రామానికి ఆయన చేసిన అభివృద్ధిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపిటిసి సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.