జగ్గంపేట డిగ్రీ కళాశాలలో అమరావతి రాజధాని సంబరాలు

413చూసినవారు
జగ్గంపేట డిగ్రీ కళాశాలలో అమరావతి రాజధాని సంబరాలు
అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేస్తూ పార్లమెంట్ ఆమోదించిన సందర్భంగా గురువారం జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వేడుకలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. చెన్నారావు ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు ప్రత్యేక సమావేశం నిర్వహించి, అమరావతి ప్రాముఖ్యత, రాష్ట్ర అభివృద్ధిలో దాని పాత్ర, చారిత్రక నేపథ్యం గురించి చర్చించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ బాలరాజు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్