అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలిలో నాగేంద్ర చౌదరి నియామకం

291చూసినవారు
అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలిలో నాగేంద్ర చౌదరి నియామకం
అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా జగ్గంపేటకు చెందిన పాలచర్ల నాగేంద్ర చౌదరి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారతీయ ధర్మ ప్రచార పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాగేంద్ర చౌదరి నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడుతున్న నాగేంద్ర చౌదరి, అన్నవరం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా మరింత చురుకుగా పనిచేయాలని ఆకాంక్షించారు. నాగేంద్ర చౌదరి మంగళవారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కలిసి ఆశీర్వాదం పొందారు.

సంబంధిత పోస్ట్