కాకినాడ, జగ్గంపేట మండలం రాజపూడి హై స్కూల్ ను గురువారం ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులకు స్వయంగా వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలు, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఈ తనిఖీ జరిగిందని ఆయన తెలిపారు. గతంలో భోజనం నాణ్యతపై విద్యార్థుల ఫిర్యాదుల మేరకు వంట సిబ్బందిని మార్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.