కాకినాడ జిల్లా వైసీపీ పరిశీలకులు దాట్ల సూర్యనారాయణ రాజు ఆదివారం కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర, జిల్లా, గ్రామ కమిటీల నియామకం, పనితీరుపై చర్చించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి కమిటీల్లో ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించారు. వారి ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు.