ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

630చూసినవారు
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని జగ్గంపేట ఎస్ఐ టి. రఘునాథరావు హెచ్చరించారు. బుధవారం గోకవరం రహదారిలో వాహనదారులకు అవగాహన కల్పించిన ఆయన, వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. ప్రమాదాల సమయంలో ప్రాణాలు కాపాడుకోవడానికి హెల్మెట్ ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్