
కాకినాడ: రసాభాసగా జడ్పీ సమావేశం
కాకినాడలో జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రారంభం కాగానే రసాభాసగా మారింది. వైద్య కళాశాలల పీపీపీ విధానాన్ని నిరసిస్తూ వైసీపీ సభ్యులు ఏజెండా ప్రారంభానికి ముందే వాదనకు దిగారు. వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో వారు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము జడ్పీ ఛైర్మన్ కు చురకలంటించారు. కొంతసేపటికి వైసీపీ సభ్యులు తిరిగి సభలోకి ప్రవేశించారు.







































