కాకినాడ జిల్లాకు 423 కొత్త స్పౌజ్ పింఛన్లు మంజూరు

14చూసినవారు
కాకినాడ జిల్లాకు 423 కొత్త స్పౌజ్ పింఛన్లు మంజూరు
ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద 2026 ఫిబ్రవరి నెలకు సంబంధించి జిల్లాలోని 2.69 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 117.03 కోట్ల పింఛన్ సొమ్ము పంపిణీకి పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంఛార్జి కలెక్టర్ అపూర్వ భరత్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరి నెలలో జిల్లాకు కొత్తగా 423 స్పౌజ్ పింఛన్లు మంజూరైనట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పింఛన్ పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. లబ్ధిదారులు తమ పింఛన్లు సకాలంలో పొందేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్