పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కాకినాడ జిల్లాలో 100 రోజుల ప్రణాళికను పగడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉత్తమ ఫలితాలు సాధించడానికి చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ ప్రణాళిక అమలుతో విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.