ఉపాధి హామీ పథకం కొనసాగించాలని సీపీఎం ధర్నా

1001చూసినవారు
కాకినాడ రూరల్ లోని సర్పవరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. 2005 మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వి.బి.జి.ఆర్.ఏ.ఎం.జి పథకాన్ని ఉపసంహరించుకోవాలని పార్టీ రూరల్ కన్వీనర్ తిరుమలశెట్టి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో మహాత్మా గాంధీ పేరును తొలగించి, కొత్త పథకానికి పేరు మార్చి గాంధీని మరోసారి హత్య చేసిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్