కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఈపీఎస్ 95 పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 9వ తేదీన కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే రమణమూర్తి, కే సత్తిరాజు గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా 82 లక్షల మంది ఈపీఎస్ 95 పెన్షనర్లలో 36 లక్షల మందికి కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు కూడా చెల్లించబడటం లేదని, మరో 36 లక్షల మందికి 2000 రూపాయల లోపు పెన్షన్ వస్తుందని, వీరందరికీ కనీస పెన్షన్ 9000 రూపాయలు, డీఏతో చెల్లించాలని గత 11 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.