జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ-వేస్ట్ అప్పగింత

907చూసినవారు
జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ-వేస్ట్ అప్పగింత
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా యుక్తి రైజ్ సంస్థ ఆధ్వర్యంలో పిఠాపురం, ఉప్పాడ ప్రాంతాలలో ఈ-వేస్ట్ కలెక్షన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో 50 కిలోల ఈ-వేస్ట్‌ను సేకరించి, జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ సమక్షంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతినిధులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వ్యర్థాల సక్రమ నిర్వహణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో ఒక ముఖ్యమైన అడుగు.

సంబంధిత పోస్ట్