కొత్త పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వేగంగా అనుమతులు మంజూరు చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్లో జరిగిన డీఐఈపీసీ సమావేశంలో ఈ త్రైమాసికంలో అందిన 856 దరఖాస్తుల్లో 737 పూర్తయ్యాయని, మిగిలిన 119 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.