జగ్గంపేటలో ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీ: ఆరోగ్యం, పర్యావరణంపై అవగాహన

764చూసినవారు
జగ్గంపేటలో ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీ: ఆరోగ్యం, పర్యావరణంపై అవగాహన
కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆదివారం ఉదయం జగ్గంపేట సిఐ బి.తిరుపతిరావు ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, మరియు శారీరక దృఢత్వంపై అవగాహన కల్పించారు. జగ్గంపేటలోని మెయిన్ రోడ్, గ్రామాలగుండా ఈ ర్యాలీ పర్యటించింది.

సంబంధిత పోస్ట్