సండేస్ ఆన్ సైకిల్’తో ఆరోగ్య సందేశం

585చూసినవారు
సండేస్ ఆన్ సైకిల్’తో ఆరోగ్య సందేశం
కాకినాడ జిల్లా పోలీసులు ఆరోగ్యకర జీవనశైలి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ 'సండేస్ ఆన్ సైకిల్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి సర్పవరం వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సైకిల్ వినియోగం వల్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు కాలుష్యం తగ్గుతుందని పేర్కొంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. "పచ్చని ప్రకృతి కోసం ప్రతి ఒక్కరూ సైకిల్‌ను అలవాటు చేసుకోవాలి" అని సూచించారు.

సంబంధిత పోస్ట్