కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై విషం కక్కుతున్నారని బుధవారం కాకినాడలో విమర్శించారు. శాశ్వత రాజధానిగా అమరావతిని అసెంబ్లీ, పార్లమెంట్ ఆమోదించాయని, ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ తీరు మారలేదని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.