జూన్ 15న కాకినాడలో ఉద్యోగ మేళా

812చూసినవారు
జూన్ 15న కాకినాడలో ఉద్యోగ మేళా
కాకినాడ కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో జూన్ 15న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు వికాస పీడీ కె. లచ్చారావు తెలిపారు. సోలార్ టెక్నీషియన్, టెలికాలర్, ట్రైనీ, టెక్నీషియన్, మొబైల్ ఆపరేటర్ వంటి పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. పదో తరగతి నుంచి బీటెక్ వరకు చదివిన, 35 ఏళ్లలోపు అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ మేళా లక్ష్యం.

సంబంధిత పోస్ట్