కాకినాడ: రేపు యధావిధిగా పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్

55చూసినవారు
కాకినాడ: రేపు యధావిధిగా పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్
కాకినాడ జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)తో పాటు రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ షమ్మోహన్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించనున్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఈ క్లినిక్ వేదిక కానుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్