రేపు కాకినాడకు రానున్న లోకేశ్.. ఏర్పాట్లు పూర్తి..

1932చూసినవారు
రేపు కాకినాడకు రానున్న లోకేశ్.. ఏర్పాట్లు పూర్తి..
మంత్రి నారా లోకేశ్ శుక్రవారం కాకినాడలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ, కోరమాండల్, అచ్చంపేట హైవే ప్రాంతాల్లో జరగనున్న కార్యక్రమాల ఏర్పాట్లను కలెక్టర్ అపూర్వ భరత్, ఎస్పీ బిందు మాధవ్ బుధవారం పరిశీలించారు. భద్రతా పరంగా ఎక్కడా అపశ్రుతులు చోటుచేసుకోకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్