ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ సంస్థకు జాతీయస్థాయిలో అవార్డు లభించింది. శుక్రవారం సంస్థ అధ్యక్షులు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కాకినాడలోని రెడ్ క్రాస్ కార్యాలయాన్ని సందర్శించి, జనరిక్ మందుల షాపు, రక్తనిధి వంటి విభాగాలను పరిశీలించారు. జాతీయ స్థాయిలో అవార్డు సాధించేలా కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు.