గర్భిణీల ఆరోగ్యానికి పౌష్టికాహారం కీలకం: ఎమ్మెల్యే కొండబాబు

1553చూసినవారు
గర్భిణీల ఆరోగ్యానికి పౌష్టికాహారం కీలకం: ఎమ్మెల్యే కొండబాబు
కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిరక్షణకు పౌష్టికాహారం తప్పనిసరి అని తెలిపారు. సోమవారం కోకనాడ అన్నదాన సమాజం కల్యాణ మండపంలో కేటీసీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–2047 మార్గదర్శి బంగారు కుటుంబాలు కార్యక్రమంలో ఆయన పాల్గొని గర్భిణీలకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. కేటీసీ సంస్థ ఆధ్వర్యంలో 412వ సారి ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ తల్లి–శిశు ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కేటీసీ ప్రతినిధులు, గర్భిణీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్