కాకినాడ కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిరప్రసాద్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. డివిజన్, పట్టణ, మండలస్థాయిలోనూ అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు కృషి చేస్తారు.