నగర సమస్యల పరిష్కారం కోసమే పురమిత్ర యాప్

807చూసినవారు
కాకినాడ నగరంలోని సమస్యల పరిష్కారం కోసం ప్రజలు 'పురమిత్ర' యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సత్యనారాయణ సూచించారు. బుధవారం దూదిమిల్లు, తిలక్ వీధి ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. డ్రైనేజీలను పాడుచేసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. మంచినీరు, పారిశుద్ధ్యం వంటి ఫిర్యాదులను యాప్ ద్వారా అందిస్తే తక్షణమే స్పందించి పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్