కాప్స్ రాక్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్ సాయం

973చూసినవారు
కాప్స్ రాక్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్‌షిప్ సాయం
కాకినాడ నగరంలోని శుభం కాపు కళ్యాణ మండపంలో 'కాప్స్ రాక్స్' ఆధ్వర్యంలో జరిగిన స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు చేయూత అందించడం సమాజ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి స్కాలర్‌షిప్‌ల కోసం రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని కాప్స్ రాక్స్ సంస్థకు అందజేశారు. ప్రతి సంవత్సరం విద్యార్థుల విద్యాభివృద్ధికి తన సహకారం కొనసాగుతుందని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్