కాకినాడ జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘ సేవలు అందించిన ఇద్దరు ఎస్ఐలు శనివారం పదవీ విరమణ చేశారు. వారిని ఎస్పీ బిందు మాధవ్ ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. విధి నిర్వహణలో వారు చూపిన అంకితభావం అభినందనీయమని ఎస్పీ కొనియాడారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలను త్వరగా అందజేయాలని పరిపాలనా అధికారిని ఆదేశించారు.