పదవి విరమణ పొందిన పోలీసులను సన్మానించిన ఎస్పీ బిందు మాధవ్

523చూసినవారు
పదవి విరమణ పొందిన పోలీసులను సన్మానించిన ఎస్పీ బిందు మాధవ్
కాకినాడ జిల్లా పోలీసు శాఖలో ఏఎస్సైలు జి. సహదేవుడు, ఎం. సత్తిబాబు మరియు హెడ్ కానిస్టేబుల్ బి. సాయి పదవీ విరమణ పొందారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ వారిని సత్కరించి, పోలీసు శాఖకు వారు అందించిన సేవలను ప్రశంసించారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసి గౌరవప్రదంగా రిటైర్ కావడం ఆనందకరమని, వారి భవిష్యత్ జీవితం ఆరోగ్యంగా, సంతోషంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్