అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
By MOGALI NAGENDRA 3చూసినవారుకాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఐపీఎస్ బుధవారం అర్ధరాత్రి నగరంలోని భానుగుడి, అన్నమ్మ ఘాటీ, డైరీ ఫాం, సర్పవరం ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాహనాల తనిఖీ, గస్తీ విధులను పరిశీలించి నేరాల నియంత్రణకు నిఘా, గస్తీ పెంచాలని ఆదేశించారు. అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు, అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు.