మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు

299చూసినవారు
మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు
కాకినాడలో పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 18 మందిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం పలువురికి జైలు శిక్షతో పాటు రూ. 10 వేల చొప్పున జరిమానా విధించింది. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి రహదారి భద్రతకు సహకరించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్