కాకినాడ జిల్లాలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు, కార్యాలయాల్లో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది భాగస్వామ్యంతో మానవహారాలు, ప్రతిజ్ఞలు నిర్వహించాలని తెలిపారు. గత వారం రంజాన్ సెలవు కారణంగా ఈ వారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.