కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదివారం మీడియా సమావేశంలో వైసీపీ నేత అంబటి రాంబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుమల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలోని కొందరు అధికారులకు ఇంకా పాత ప్రభుత్వ పోకడలు పోలేదని ధ్వజమెత్తారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.