రైతు, కార్మిక సంఘాల సమ్మెకు వాణిజ్య సంస్థల మద్దతు

184చూసినవారు
రైతు, కార్మిక సంఘాల సమ్మెకు వాణిజ్య సంస్థల మద్దతు
రైతు, కార్మిక సంఘాలు తలపెట్టిన ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెకు స్థానిక వాణిజ్య వ్యాపార సంస్థలు మద్దతుగా స్వచ్ఛంద బంద్ పాటించాలని కోరుతూ మర్చంట్ అసోసియేషన్ నాయకులు గ్రంధి బాబ్జి గారికి సమ్మె నోటీసులు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు సామాన్య ప్రజల కొనుగోలు శక్తిని బలహీనపరుస్తాయని, దీని ప్రభావం స్థానిక వ్యాపార సంస్థలపై తీవ్రంగా ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థికమాంద్యం, అమెరికా సుంకాలు, నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్