అక్రమ మట్టి నిల్వలు: అధికారుల మౌనంపై ప్రజల అనుమానాలు

1161చూసినవారు
అక్రమ మట్టి నిల్వలు: అధికారుల మౌనంపై ప్రజల అనుమానాలు
పెదపూడి మండలంలోని పలు గ్రామ శివారులలో అక్రమ మట్టి నిల్వలు ఉన్నాయంటూ వార్తా మాధ్యమాలలో వస్తున్న వార్తలకు సంబంధిత అధికార యంత్రాంగం స్పందించకపోవడంపై ప్రజలలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాల్సిన అధికారులు అక్రమ మట్టి తరలింపులను అడ్డుకోకపోవడం వారి నైతికతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని పలువురు విమర్శిస్తున్నారు. కాకినాడ, కాకినాడ రూరల్ ప్రాంతాల్లో ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ అక్రమ మట్టి నిల్వలు, తరలింపులపై అధికారుల ఉదాశీనత ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది.
Job Suitcase

Jobs near you