ఎంపీ కార్యాలయంలో ఆర్భాటం లేకుండా భక్తితో మట్టి గణపతికి నిమజ్జనం

2చూసినవారు
భారీ డీజే సౌండ్లు, ర్యాలీలు, బాణాసంచా కాలుష్యానికి దూరంగా రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో వినాయక నిమజ్జనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న మట్టి గణపతి విగ్రహాన్ని కార్యాలయంలో ఏర్పాటు చేసిన నీటి తొట్టిలోనే కరిగించి నిమజ్జనం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలిచింది.

సంబంధిత పోస్ట్